Monday, 3 October 2016

ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు !



ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు !

భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి హత్యలకి చాలావరకు అక్రమసంబందాలే కారణం అవుతుంటాయి.  హైదరాబాద్  జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్  లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువ . ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సమాజాన్నిఅస్థిరపరుస్తాయి. ఏడడుగుల బంధం తో ఒక్కటైన జంట మధ్య మూడో వ్యక్తి రావడానికి ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయి.. అవేమిటంటే..

1. భర్త తరచూ క్యాంపు లకి వెళ్తుంటే :

హైదరాబాద్  జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్  లాంటి ప్రాంతాల్లో కొంతమంది వృత్తి రీత్యా ఎక్కువ క్యాంపులకి వెళ్ళాల్సి వస్తుంది. రోజుల తరబడి భర్త దూరంగా ఉండి, ఇంట్లో అత్తమామలు కాని, కొంచెం పెద్ద పిల్లలు కాని లేకపోతే, అలాంటివాళ్ళు ఎఫైర్స్ వైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అయితే, వృత్తిరీత్యా క్యాంపులు తప్పనప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు అయినా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తన లైంగిక ఆసక్తులని గమనించి మసలు కోవాలి, క్యాంపు కి వెళ్ళినప్పుడు రోజుకి రెండు మూడు సార్లైనా భార్యకి ఫోన్ చేయాలి. భార్యభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటె. తాత్కాలిక ఎడబాటు అనేది ఇబ్బందే కాదు.

2. వ్యసనాలు :

భర్త కి కనుక తాగుడు, పేకాట లాంటి వ్యసనాలు ఉంటే,అలాంటి వారి భార్యలు అక్రమసంబంధం పెట్టుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.తాగుడికి బానిసైన వాడు, ఎప్పుడో ఇంటికోస్తాడు, ఇంటి బాధ్యత పట్టించుకోడు, భార్యతో సెక్స్ చేసినా అది యాంత్రికంగా ఉంటుంది తప్ప ఎమోషన్ ఉండదు. పేకాట లాంటి జూదాలకి అలవాటు పడితే అసలు ఇంటికి రావడమే తగ్గిపోతుంది. ఇలాంటి వారి భార్యలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే ఎఫైర్స్ వైపు మొగ్గు చూపుతారు.

3. సెక్స్ కోర్కెలు విపరీతంగా ఉండడం :

ఇది చాలా కొద్దిమందిలో ఉండే సమస్య. భర్త ఎంత బాగా చూసుకుంటున్నా, రోజూ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా, కొందరికి తనివి తీరదు. ఎప్పుడూ అదే యావ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మారాలంటే, కౌన్సిలింగ్ చేయించడం ఒక్కటే మార్గం.

4. బోర్ కొట్టడం :
గతం లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, లేదా మనుషులు ఎక్కువగా ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు భార్యభర్తలకి ఎక్కువ ఏకాంతం దొరికేది కాదు. దానికి తోడు పండగలు, పెళ్ళిళ్ళకి ఊరెళితే ఆడవాళ్ళు నెల రోజులు పైగా మకాం వేసేవారు. దానితో భార్యాభర్తల మధ్య విరహం ఉండేది. విరహం తర్వాత కలయిక మధురంగా ఉంటుంది కాబట్టి, రిలేషన్స్ మరింత బలపడేవి. ఇప్పుడలా కాదు, ప్రతి జంటకి బెడ్ రూమ్ ఉంటోంది, రోజు సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటోంది. అలాగే ఊరెళితే మూడు రోజులకన్నా ఎవరూ ఎక్కువ ఉండడం లేదు. దీనితో విరహం అనేది తెలియకుండా పోతోంది. అలాంటప్పుడు కొంతమందికి కొద్ది సంవత్సరాల్లోనే పార్టనర్ అంటే బోర్ కొడుతుంది. అది వేరే ఎఫైర్స్ కి దారితీస్తుంది.

5. భర్త ఫిజిక్ సరిగా లేకపోవడం :

చాలామంది మగవాళ్ళు పెళ్లి కాగానే శరీరం మీద శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారు. పిల్లలు పుట్టాక అయితే మరీ. బొజ్జని ఒక కుండ లాగా పెంచేసి, శరీరాన్ని భారీగా పెంచేసి, కదలడమే కష్టం అన్నట్లు తయారవుతారు. ఇలాంటి తన జీవిత భాగస్వామిని ‘సంతృప్తి’ పరచలేక పోవచ్చు. అలాంటప్పుడు కూడా ఆడవారు ఎఫైర్స్ వైపు మళ్లుతారు.

6. భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోవడం :

ఇది కొంచెం క్లిష్టమైన కారణం. భార్య భర్త మధ్య సంబంధం బాగానే ఉంటుంది. రోజూ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంటుంది. అయితే, ఇద్దరి టేస్ట్ లు భిన్నంగా ఉంటాయి. భార్యకి సంగీతం అంటే పిచ్చి, భర్తకి రాజకీయాలంటే ఇష్టం అనుకోండి, అప్పుడు ఒకరి ఇష్టాఇష్టాలని మరొకరు గౌరవించి, ఆసక్తి చూపించినప్పుడు రిలేషన్స్ బాగానే ఉంటాయి. అలా కాకుండా ఎవరి లోకం లో వాళ్ళు ఉంటారనుకోండి, ఎమోషనల్ సపోర్ట్ కోసం వేరే వారి పట్ల ఆకర్షితులు అవుతారు. కళాకారులు, రచయితలలో ఈ తరహా ఎఫైర్స్ ఎక్కువ ఉంటాయి.

ఇవీ అక్రమసంబంధాలకి ప్రధాన కారణాలు. ఈ మాయ నుండి బయటపడకపొతే, ఈ మోజు మొగ్గలోనే తుంచకపోతే కాపురాలు కూలిపోతాయి. మరో ముఖ్యమైన విషయం.. పైన తెలిపిన కారణాలన్నీ కూడా జనరలైజ్ చేసి చెప్పినవే. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి, ఏ విషయం లోనూ తొందరపడకుండా, అలాగని నిర్లక్ష్యం చేయకుండా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించండి. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన భారతీయ కుటుంబ వ్యవస్థని నిలబెట్టండి. విష్ యు ఏ వెరి హాపి మారీడ్ లైఫ్.
Show less  ·  

1 comment:

  1. Top 10 Best Indian Casinos in the USA - Mapyro
    10 Best Indian Casinos 영주 출장안마 in the USA · 1. 과천 출장샵 Red Dog 서귀포 출장마사지 – Best Overall Casino · 2. MGM Resorts 이천 출장안마 – Best 춘천 출장마사지 Overall Casino · 3. Borgata Hotel Casino & Spa

    ReplyDelete